deepakanthi

Tuesday, December 2, 2008

దీపాత్ జ్ఞాన మవాప్నోతి







దీపజ్యోతి పరబ్రహ్మ

ఏదైనా పూజ కార్యక్రమం అనుకుంటే అందరి ద్రుష్టి పోయేది 'దీప ధూప నైవద్యాలపైనే! మనం ఎన్ని పూజలు చేసినా ఈ మూడు మాత్రమె భగవంతునకు చెందుతాయి.
భగవంతుని పూజలో దీపం ఎందుకు పెట్టాలి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెప్పాలో తేలేక మనం తెల్ల మొహం వేస్తాం .
అటువంటి పరిస్తితి నుం డి బయటపడడానికి మనకు ఆ విషయం పై అవగాహన ఉండాలి. అటువంటి వారి కోసమే ఈ దీపజ్యోతి .ఈ వ్యాసంలో మనం వాటి శాస్త్రబధత గురుంచి తెలుసుకుందాము.

ఇహలోక బంధనాలలో గాడంధకారంలో ఉన్న మనకు, భగవంతుని చేరే వెలుగు మార్గం చూపేదే ఈదీపారాధన. ఇదివరకు చదువుకున్న 'అసతోమా సద్గమయ,తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతంగమయ,ఓం శాంతి శాంతి శాంతి" అనే శ్లోకాన్ని నేమరువేసుకొందాము.

ఎ ఇంట్లో అయితే దీపం ప్రకాశిస్తూ ఉంటే ,ఆయింట్లో సిరి తాండవిస్తూ ఉంటుంది.అసలు జ్యోతి వేలిఉగించడమే "వేస్ట్" అనేప్రబుదులు ఉన్న ఈ దేశంలో మనం మొదటి నుండి అగ్ని ఆరాధకులమే అని తెలియ చేయాలి.

"దీపాత్ జ్ఞాన మవాప్నోతి"-
భగవంతుడి ముందు దీపం వెలిగించడం వలన పాపాలు కరిగి,బుద్ధిబలం కలుగుతుంది.

దీపారాధన ఎలా చేయాలి?
దీపారాధనకు వెండి ప్రమిదలు శ్రేష్టం.కంచుతో చేసినవి , రాగితో చేసినవి మోక్షకరం, ఇత్తడితో చేసినవి అధమం.దీపారాధనకు మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు.
ఆవునేతితో దీపారాధన శ్రేష్టదీనితో సకల సంపదలు,కలుగుతాయి.వేపనూనె,నెయ్యి,కానగ నూని కలిపి దీపారాధన చేస్తే సర్వసంపదలు అక్కడికి వచ్చి చేరుతాయని శాస్త్రం చెపుతుంది.
ప్రత్తితో చేసిన వత్తులతో దీపం ఉత్త్తమం . తామర తూడులతో చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే గత జన్మ పాపాలు కుడా నశిస్తాయని శాస్త్ర ఉవాచ.
ఒక్క దీపం వెలిగించడం అశుభం. జ్యోతి సర్వశ్రేష్టం.పంచ ముఖాల జ్యోతిని వెలిగిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.
ప్రదోషకాలంలో వెలిగించిన దీపం మంచిది. దీపపు కుందుని ఒత్తినేలపై పెట్టరాదు .
.దీపాన్ని అరటి ఆకుపై కాని, చిన్న ప్లేటు పైన కాని పెట్టాలి.
ఈదిసలో దీపం పెట్టాలి ?
ఇంట్లో ఎపుడు పడమర దక్షిణ దిశలలో దీపం పెట్టొద్దు.దీపాలేపుడు తూర్పుముఖం గా లేక ఉత్తర ముఖంగ పెడ్తే సంపదలన్నీ మీ ఇంటికే.
వెలిగించిన దీపాన్ని ఎపుడు నోటితో ఆరపకుఉడదు.
ప్రతి హిందువు ఇంట్లో ఓ పూజామందిరం,ఒక తులసికోట ఉంటుంది. అక్కడ ఉదయ,సాయం కాలాలలో దీపాలు పెట్టండి.అదే మనం చేసే దీపారాధన.
రాండిమనం ఆ దీపారాధనకు ప్రార్ధన చేసుకుందాము.


౧. దీపస్త్వం బ్రహ్మ రూపోసి -జ్యోతిషం ప్రభురవ్యాయ:
సౌభాగ్యం దేహి పుత్రంస్చ-కామంస్చ దేహియో
ఓ దీప దైవమా- నీవుబ్రహ్మ స్వరూపమై ఉన్నావు.
మాకు సకల సౌభాగ్యాలను సుపుత్రులను ఇచ్చి
మా కోరికలన్నీ దయతో తీర్చుమా!
౨.శ్రేష్టమైన నేతియందు ,మూడు వత్తులతో వేలుగొందుచు
మూడు లోకాల గాదాన్ధకరం పోగోత్తకలిగిన జ్యోతిత్రయం వెలిగించి
సర్వాంతర్యామి వయిన నీకు భక్తిస్రధలతో నమస్కరించుచున్నాను.
౦౩౩. దివ్యజ్యోతి స్వరూపమైన ఓ దైవమా
నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షింపుము.
"





Followers

About Me

My Photo
My favourate site is http://onlineincome4all.com/ which shows the way to get online income. It's not a site, it's aguide book